young man commits suicide: ప్రైవేట్ ఫైనాన్షియర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్జీఐఏ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పాత శంషాబాద్ జెండా చౌరస్తాకు చెందిన సాయి కిరణ్(25) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకొని ద్విచక్ర వాహనాన్ని కొన్నాడు. నెల కిస్తులు సక్రమంగా చెల్లించడం లేదంటూ సాయి కిరణ్‌ను దూషించి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మనస్తాపం చెందిన అతడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: