Young man suicide: ఏపీ విశాఖలో హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్న దినేశ్(28)కు తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదన్నా... దినేశ్ మాట వినకుండా నిర్ణయించారు. పెళ్లికొడుకును చేసిన ముందురోజు ఇంట్లో నుంచి వెళ్లి యారాడ బీచ్‌కు వెళ్లాడు. బంధువులు వెతికి ఇంటికి తీసుకువచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది. ఎలాగైనా పెళ్లిచేస్తారనుకున్న దినేశ్... ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: