ETV Bharat / crime

attack on lady: యువతిపై బ్లేడుతో దాడి.. గతంలోనూ..! - అనకాపల్లి జిల్లాలో యువతి మెడపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు

Attack on lady: ఏపీలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో యువతిపై ఓ వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

attack on lady: యువతిపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు.. గతంలోనూ..!

author img

By

Published : Apr 25, 2022, 3:07 PM IST

Updated : Apr 25, 2022, 3:42 PM IST

attack on lady: యువతిపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు.. గతంలోనూ..!

Attack on lady: ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పట్టణంలోని ఓ ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక జగ్గన్న చావిడి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న స్వాతి అనే యువతి మెడపై అదే గ్రామానికి చెందిన నగేశ్‌ అనే యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధిత యువతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. స్వాతిపై నగేశ్‌ గతంలోనూ ఇదే విధంగా దాడి చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

పెళ్లైన నెల రోజులకే భర్తపై..

ఇక తెలంగాణలోనూ ఇలాంటి 'బ్లేడు దాడి' ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పసరగొండకు చెందిన రాజు, అర్చన దంపతులు. వారికి నెల క్రితమే వివాహం జరిగింది. నెల రోజుల్లోనే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ ఉదయం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో.. రాజుపై అర్చన దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న బ్లేడుతో అమానుషంగా గొంతు కోసి చంపేందుకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే రాజును వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి..

దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

రెండురోజుల క్రితం గృహప్రవేశం.. దంపతులు సజీవ దహనం.. పాపం కుమార్తె...

Last Updated : Apr 25, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.