ETV Bharat / crime

బైక్​తో ఢీకొట్టి... పొలాల్లోకి లాక్కెళ్లి కత్తులతో నరికి చంపారు - నిడమనూర్​లో యువకుడి దారుణ హత్య

నల్గొండ జిల్లా నిడమనూర్ మండల పరిధిలో ఓ యువకుడిని... దుండగులు కిరాతకంగా హత్య చేశారు. మృతుడు మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన మచ్చ శ్రీకాంత్​గా పోలీసులు గుర్తించారు.

telangana news
crime news
author img

By

Published : Apr 22, 2021, 9:19 PM IST

ఓ యువకుడిని ద్విచక్ర వాహనంపై వెంబడించి... బైక్​తో ఢీకొట్టి.. పొలాల్లోకి లాక్కెళ్లి కత్తులతో నరికి చంపిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూర్​ మండల పరిధిలో జరిగింది. నారమ్మగూడెం- సత్యనారాయణపురం మార్గంలో యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన మచ్చ శ్రీకాంత్​ ఇవాళ ఉదయం తుంగపాడు నుంచి నిడమనూర్ మండలం రేగులగడ్డకు ద్విచక్రవాహనంపై వచ్చాడు. తిరిగి వెళ్లిపోతుండగా.. బైక్​పై వెంబడించిన దుండగులు తమ వాహనంతో ఢీకొట్టారు. కిందపడిపోయిన శ్రీకాంత్​ను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి కత్తులతో నరికి చంపారు.

ఈఘటనలో శ్రీకాంత్​తో కలిసి ద్విచక్రవాహనంపై ఉన్న అతని బంధువు కళ్లలో కారం కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య వెనుక భూ తగాదాలు... మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కొడంగల్​ పరిధిలో పిడుగుపాటుతో 32 గొర్రెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.