ETV Bharat / crime

suicide selfie video viral: 'నా చావుకు వారే కారణం.. వైకాపా కార్యకర్త సూసైడ్ సెల్ఫీ వీడియో' - చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

వైకాపా కార్యకర్త ఆత్మహత్యకు యత్నించారు. సొంత పార్టీ నేతల వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి యత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. ఈ సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. పోలీసులు అతని కోసం అడవుల్లో గాలిస్తున్నారు.

ycp follower suicide attempt
వైకాపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 21, 2022, 11:54 AM IST

suicide attempt: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో వైకాపా కార్యకర్త వెంకటేశ్ ఆచారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పనపాకం పంచాయతీ కొత్తపేటలో తన ఇంటి పక్కనే కొన్న స్థలాన్ని స్థానిక వైకాపా నేతల సాయంతో కొందరు ఆక్రమించుకుంటున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. పనపాకం గ్రామంలో నాయకుల హామీతో రోడ్డు పనులు చేస్తే రూ.6 లక్షలు అప్పులు మిగిలాయని వాపోయారు.

వైకాపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనోవేదన గురయ్యానని పురుగుల మందు డబ్బా చేతబట్టుకుని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. నా చావుకు అధికారులు, కొందరు స్థానిక నేతలే కారణమని ఆరోపించారు. సెల్ఫీవీడియోను కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు.. బాధితుడు వెంకటేశ్ కోసం పనపాకం అడవుల్లో గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

Save Me: పోలీసుల నుంచి కాపాడండి.. జిల్లా ఎస్పీకి ఓ వ్యక్తి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.