Women were attacked by YCP activists: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో వైసీపీకి సంబంధించిన రెండు వర్గాల మధ్య రగడ జరిగింది. గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఒక వర్గంలోని కొంతమంది మహిళలు రోడ్డు బాగోలేదని, మా పక్కన ఉన్న రోడ్లు వేశారు కానీ.. మా ఇళ్ల ముందు రోడ్లు వేయకుండా ఆపేశారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెళ్లిన వెంటనే ప్రశ్నించిన మహిళలపై మరో వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు.. కర్రలు, రాళ్లతో దాడులు జరిపారు. ఇష్టానుసారంగా ఇళ్లపై రాళ్లు విసిరారు. ట్రాక్టర్లు, బైక్లు ధ్వంసం చేశారు. అనంతరం ఇళ్లల్లోకి వెళ్లి బీరువాల నుంచి సుమారు 3 లక్షల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు బాధితులు ఆరోపించారు. ఇదంతా స్థానిక పోలీసుల కనుసైగల్లోనే జరిగిందని తెలిపారు.
ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు వారు మా మీద దాడులు చేశారు. ఎమ్మెల్యే వెళ్లిపోయాక పోలీసులు, ఊర్లో ఉన్న నాయకులు కలిసి కుమ్మక్కై మా ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేసి.. సుమారు 3 లక్షల నగదు, ట్రాక్టర్లు, బైక్లు ధ్వంసం చేశారు. సుమారు 17లక్షల రూపాయల ఆస్తి ధ్వంసం చేసి వెళ్లారు. ఇందులో పోలీసుల హస్తం ఉంది.. అందుకే వారు అంత ధైర్యంగా దాడులు చేసి.. చంపుతామని బెదిరించారు. - బాధితుడు
ఇవీ చదవండి: