యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి పారిశ్రామిక వాడలోని సాయి కృష్ణ ఇండస్ట్రీస్‌లో(ప్లాస్టిక్ గ్రాన్యూయల్స్ కంపెనీ ) అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో మంటలు పక్క పరిశ్రమలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.
ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:అల్లుడు అప్పు తీర్చడం లేదని.. మనవడిని అమ్మిన అత్త.!