Sanitation Worker Died: ఖమ్మం జిల్లాకేంద్రంలోని నయాబజార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిషన్ భగీరథ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఓ కార్మికుడు మృతి చెందాడు. ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు దిగారు. వారు నీటి ట్యాంక్ లోపల శుభ్రం చేస్తుండగానే పైప్‌లైన్‌లోకి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారి పోయాడు. పైపులైన్ చిన్నదిగా ఉండడంతో ఊపిరి ఆడక కార్మికుడు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సాయంతో మట్టిని తవ్వి పైపులైన్ నుంచి కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో కార్మికుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల ధర్నా చేపట్టాయి.
ఇవీ చదవండి: దొంగనోట్ల ముఠా అరెస్ట్.. ఆదివాసీలే లక్ష్యంగా చలామణి..!
మెదడుకు ఆపరేషన్ చేస్తూ డాక్టర్లు బిజీ.. పాటలు పాడుతూ రోగి సందడి!