ఏపీ కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో దొంగలు హల్చల్ చేశారు. కంకిపాడు బస్టాండ్ సమీపంలోని ఓ వీధిలో ఇద్దరు మహిళలు (అత్త, కోడలు) అరుగుపై కూర్చున్నట్టుగా నటిస్తూ... గడియ వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగులగొట్టిలోపలికి ప్రవేశించారు. బంగారు నగలు, వస్తువులను సంచిలో వేసుకున్నారు. అనంతరం టీవీ చూస్తూ ఉండగా.. ఇంటి యజమాని వచ్చారు.
మీరు ఎవరు? ఏం కావాలి అని యజమానిని దొంగలు అడగ్గా.. అవాక్కవడం ఆయన వంతైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాద్విత.. రెండు నెలల క్రితమే జైలుకెళ్లి బయటకు వచ్చారు. తాజా ఘనకార్యంతో మళ్లీ కారాగారానికి చేరారు.
ఇవీచూడండి: నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు