క్షణికావేశంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు కొందరు. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణానికి ఒడిగడుతున్నారు. బ్రౌన్ రైస్ తినలేక తెల్ల బియ్యం తేవాలని ఇంట్లో వాళ్లకు చెప్పినా పట్టించుకోకపోవడంతో... ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నారాయణగూడ దత్తానగర్‌కు చెందిన రాంబాబు, స్వప్నలకు వివాహమై 20 ఏళ్లు అవుతుంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాంబాబు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుండగా... స్వప్న సమీపంలోని ఓ బేకరీలో స్వీపర్‌గా చేస్తుంది. వీరి పిల్లలు ఇంటర్ చదువుతున్నారు.
నిత్యం ఇంట్లో బ్రౌన్ రైస్ భోజనం చేస్తుంటారు వారు. ఎప్పుడైనా తెల్లన్నం తినాలని ఉందంటే స్వప్న కోసం భర్త తెల్ల బియ్యం ఒక కేజీ తెస్తుంటాడు. కొంతకాలంగా రాంబాబు తెల్లబియ్యం తీసుకురాకపోవడంతో... తాను చచ్చిపోతానంటూ స్వప్న బెదిరించేది. అయినా పట్టించుకోక పోవడంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంటిలోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవగారానికి తరలించారు. సన్న బియ్యం కోసం ఆత్మహత్య చేసుకోవటంతో వారి పిల్లలు తల్లిలేని వారిగా మారారు. ఒక్క క్షణం ఆమె ఆలోచించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు.
ఇదీ చదవండి: WOMEN MURDER: గుంటూరు మహిళ హత్య కేసులో... కోడలే నిందితురాలు