హైదరాబాద్ ఫిలింనగర్లో మహిళను బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఓ వ్యాపారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్రపరిశ్రమలో వ్యాపారం చేసేం దయానంద్ అనే వ్యక్తి తనను రాజమండ్రి నుంచి తీసుకువచ్చి ఇంటిలో బంధించి లైంగికంగా వేధించాడని బాధితురాలు తెలిపింది. శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది.
తనను ఇంటిలో బంధించారని కాపాడాలంటూ బాధితురాలు ఫోన్ చేయగా.. హుటాహుటిన ఫిలింనగర్‌లోని ఆదిత్య అపార్ట్మెంట్కి పోలీసులకు పరుగులు తీశారు. ఆమె ఉన్న ఇంటి తాళాలు తెరిచి కాపాడారు. అనంతరం బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- ఇదీ చూడండి : మేడారం జాతరలో చోరులు.. 13 సెల్ఫోన్లు స్వాధీనం