భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న భాషమ్మ అనే మహిళను దుండగులు అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జరిగింది. గుమ్మడిదల గ్రామంలో నర్సాపూర్ మండలం లింగాపురానికి చెందిన భాషమ్మ అనే మహిళ, 12 ఏళ్ల కుమారుడు జగదీశ్‌తో నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లోనే సోమవారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: వ్యక్తి ఆత్మహత్య... కాపాడబోయి వియ్యంకుడు మృతి!