ETV Bharat / crime

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మరో ప్రియుడిని చంపిన మహిళ - ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని చంపిన మహిళ

murder
murder
author img

By

Published : Jan 16, 2023, 11:42 AM IST

Updated : Jan 16, 2023, 2:57 PM IST

11:31 January 16

నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మరో ప్రియుడిని చంపిన మహిళ

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మరో ప్రియుడిని చంపిన మహిళ

Woman Kills Ex Boyfriend With New Lover Help : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ మహిళ తన కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది. మాజీ ప్రియుడు రవికుమార్‌ను యువతీయువకులు రాయితో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని బిజినేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అసలేం జరిగిందంటే.. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ రాయలసీమలోని తాడిపత్రి ప్రాంతానికి గత ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం వెళ్లింది. అక్కడే రవికుమార్(35) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి అక్కడే కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత స్వగ్రామమైన వట్టెంకు తిరిగివచ్చారు. వట్టెంలో ఇద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు.

అయితే వట్టెంకు తిరిగి వచ్చిన తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గతంలో కృష్ణమ్మ.. జడ్చర్లకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తితో ప్రేమలో ఉండేది. వట్టెంకు తిరిగి వచ్చిన తర్వాత వీరి మధ్య మళ్లీ సఖ్యత కుదిరింది. ఈ విషయంలోనే రవికుమార్- కృష్ణమ్మ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి శ్రీనివాసులు కృష్ణమ్మ ఇంటికి రావడంతో వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. రవిని ఎలాగైనా చంపేయాలని కృష్ణమ్మ-శ్రీనివాసులు పథకం పన్నారు.

ఇవాళ తెల్లవారుజామున ఇద్దరూ కలిసి నిద్రపోతున్న రవిపై బండరాయితో మోది చంపేశారు. బలమైన గాయాలు తగిలి రవి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

'రవి కుమార్​ అనే వ్యక్తిని నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోదీ హత్య చేశారు. ఈ రవికుమార్ వట్టెంలో నివసిస్తున్న కృష్ణమ్మతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అదే మాదిరిగా కృష్ణమ్మ జడ్చర్లకు చెందిన శ్రీనివాస్​తోను వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఈ విషయంలో కృష్ణమ్మ, రవికుమార్ మధ్య గొడవ జరగడంతో దానిని దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ పన్నాగానికి పాల్పడినట్టు అనుమానం. అయితే ఈ హత్య కృష్ణమ్మ, శ్రీనివాస్ కలిసి చేశారా ? లేదా మరే ఎవరితోనైనా చంపించారా ? ఈ కేసును విహహేతర సంబంధం కోణం, ఇంకేదైనా విషయంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.'-సీఐ, నాగర్ కర్నూల్

ఇవీ చదవండి : కుక్కకు భయపడి భవనంపై నుంచి దూకిన డెలివరీ బాయ్ మృతి

Last Updated : Jan 16, 2023, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.