ETV Bharat / crime

Kaiser nagar road accident: కైసర్​నగర్​లో రోడ్డు ప్రమాదం.. భర్త కళ్ల ముందే భార్య మృతి - కైసర్​నగర్ న్యూస్​

Kaiser nagar road accident: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంటను కాంక్రీట్ లారీ ఢీ కొట్టిన ఘటనలో... భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతడిని అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం మేడ్చల్ జిల్లా కైసర్​నగర్​లో జరిగింది.

Kaiser nagar road accident
Kaiser nagar road accident
author img

By

Published : Dec 26, 2021, 2:19 PM IST

Kaiser nagar road accident: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను కాంక్రీట్ లారీ ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కైసర్​నగర్​లో చోటుచేసుకుంది. ప్రగతి నగర్​కు చెందిన థామస్, విజయారాణి(43) ద్విచక్ర వాహనంపై అల్వాల్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలోని కైసర్​నగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కాంక్రీట్ లారీ ఢీకొట్టింది.

విజయరాణి తలపై నుంచి కాంక్రీట్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. థామస్​కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: Girl kidnap attempt in AP : పదేళ్ల బాలిక అపహరణకు యత్నం.. ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.