ETV Bharat / crime

మరిది కొట్టడంతో వదిన ఆత్మహత్య.. శవాన్ని మూటలో కట్టి.. - vikarabad district news

Woman Suicide: పోషించే దిక్కు లేక ఆదరణ కోల్పోయిన తల్లీకూతుళ్ల పట్ల బాధ్యత కనబర్చాల్సిన అత్తింటివారు.. ఆస్తి కోసం వేధింపులకు గురిచేశారు. ఒకే ఇంట్లో ఉంటూనే.. మామ, మరిది, అతని భార్య కలిసి తరచూ ఆమెతో గొడవలకు దిగేవారు. మాటలు కాస్తా దాడుల వరకూ వెళ్లాయి. సొంత అన్న భార్య అని కూడా చూడకుండా మరిది సైతం ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు.. బావిలో దూకి బలవన్మరణం చెందింది. ఘటనతో జైలు పాలవుతానని భావించిన ఆమె మరిది... శవాన్ని మాయం చేసి తప్పించుకుందామనుకున్నాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. వికారాబాద్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

woman committed suicide due to family harassments
మరిది కొట్టడంతో వదిన ఆత్మహత్య
author img

By

Published : May 22, 2022, 12:19 PM IST

Woman Suicide: కేవలం తాము కొట్టినందుకే మనో వేదనతో ఆత్మహత్య చేసుకుందని, బయటకు తెలిస్తే గొడవవుతుందని సొంత వదిన శవాన్ని సంచిలో కట్టి తీసుకువెళ్లి ఆమె మరిది సింగూర్‌ డ్యాంలో పడేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట పోలీస్​ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలను ఎస్సై విజయ్‌ప్రకాష్‌ వెల్లడించారు. మండల పరిధి అమ్రాదికలాన్‌ గ్రామానికి చెందిన సంఘముని (45)భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి సంఘముని, ఆమె కూతుళ్లు, మరిది మేకల శ్రీనివాస్‌, మామ బీరయ్య అందరూ కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వారి మధ్య సొంత భూమి 10 ఎకరాలకు సంబంధించి వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం(మే 15) రాత్రి మామ, మరిది, అతని భార్య లక్ష్మి కలిసి గొడవ పెట్టుకొని ఆమెను కొట్టారు.

woman committed suicide due to family harassments
మృతురాలు సంఘముని

కుటుంబీకుల దాడితో మనస్తాపానికి గురైన సంఘముని.. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తున్నానని చెప్పి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మరిది గ్రామ పెద్దలకు తెలిస్తే కుటుంబసభ్యులకు శిక్ష పడుతుందని ఎవరికీ అనుమానం రాకుండా తన స్నేహితుడు శ్రీహరి సహాయంతో శవాన్ని బావిలో నుంచి వెలికి తీసి ఓ మసాల సంచిలో కట్టాడు. ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం పరిసరాల్లోని సింగూర్‌ డ్యాం వంతెన పైనుంచి నీటిలో పడేశాడు. ఏమీ తెలియనట్లు గత మంగళవారం(మే 17) అతను ఠాణాకు వచ్చి తన వదిన కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు.

మహిళ అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కుటుం సభ్యులను విచారించారు. సంఘముని మృతికి కారణం కుటుంబ సభ్యులేనని దర్యాప్తులో తేలింది. ఆమె మరిదిని తమదైన శైలిలో విచారించగా శవాన్ని సింగూర్‌ డ్యాంలో పడేసినట్లు చెప్పాడు. శనివారం డ్యామ్ దగ్గరికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. నిందితులను విచారిస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్ ప్రకాష్ తెలిపారు.

ఇవీ చదవండి: పగ, ప్రతీకారం ఒకరిది.. పావులుగా మారుతోంది మరొకరు

'మాకు కావాల్సింది ఎన్​కౌంటర్లు కాదు.. 'రక్షణ''

మందుకొట్టి అమ్మాయిల రచ్చ.. రేంజ్​ రోవర్​తో ఢీ.. ఒకరు మృతి.. ఎస్సైపైనా దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.