Lovers Suicide: పెళ్లయిన ఓ యువకుడు తన భార్య, కూతురును కాదని మరో యువతితో కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల కెనాల్లో దూకి మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరీదేవిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ పట్టణం సంజయ్‌నగర్ కాలనీకి చెందిన నరేష్‌కు, అచ్చంపేటకు చెందిన మౌనిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. వారికి ఏడాదిన్నర పాప కూడా ఉంది.
ఈ క్రమంలో గురువారం నరేష్ కల్వకుర్తి పట్టణానికి చెందిన కళ్యాణి అనే యువతితో కలిసి గౌరీదేవిపల్లి గ్రామ సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువలో దూకి గల్లంతయ్యారు. తమ కూతురు కళ్యాణి కనిపించడం లేదంటూ కల్వకుర్తి పట్టణంలో తల్లిదండ్రులు గత మూడు రోజుల క్రితమే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు.
కెనాల్ గట్టున ఉన్న వారి చెప్పులు, చేతి వాచీలు గుర్తించిన పోలీసులు అక్కడే ఒక సూసైడ్ లెటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి కోసం కోసం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
సూసైడ్ నోట్లో ఏం ఉందంటే..
గత నాలుగేళ్లుగా మేము(నరేష్, కళ్యాణి) ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ మా ఇళ్లలో తెలిసి తిట్టడమే కాకుండా కొట్టారు. మమ్మల్ని విడిపోవాలని ఇబ్బంది పెట్టారు. మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేక మూణ్నాలుగు రోజులు బయట కలిశాం. ఈ విషయం ఇంట్లో తెలిసి ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించారు. కలవకూడదంటూ టార్చర్ పెట్టారు. వాళ్ల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నాం. -నరేష్
ఇదీ చదవండి: