ETV Bharat / crime

'ఆ వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నాడు.. అందుకే చంపేశా..' - Hanamakonda district crime news

Wife Killed Husband in Hanamakonda : పరాయి స్త్రీలతో కలిసి ఉన్న దృశ్యాలను వీడియోలు తీసి చూపిస్తూ వేధిస్తున్నాడన్న ఆక్రోశంతో ఓ మహిళ తన భర్తను  కడతేర్చింది. కాజీపేటలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జన్నారపు సుస్మితతో పాటు కొంగర అనిల్‌, గడ్డం రత్నాకర్‌, కటకం నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

భర్తను చంపించి.. కనిపించడం లేదంటూ రోజూ స్టేషన్‌కు.. కట్‌చేస్తే..!

author img

By

Published : Dec 18, 2022, 7:49 PM IST

Updated : Dec 19, 2022, 8:14 AM IST

భర్తను చంపించి.. కనిపించడం లేదంటూ రోజూ స్టేషన్‌కు.. కట్‌చేస్తే..!

Wife Killed Husband in Hanamakonda : మహబూబాబాద్‌కు చెందిన జన్నారపు వేణుకుమార్‌ చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తుండగా, భార్య సుస్మిత రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాజీపేటలోని డీజిల్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. వేణుకుమార్‌ మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా సుస్మిత సర్దుకుపోయింది. అంతేకాకుండా ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు.. వారితో కలిసి ఉన్న వీడియోలు తీసి, వాటిని తరచూ చూపిస్తున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయినా ఎంతకూ మార్పు రాకపోవడంతో తన భర్తను చంపాలని నిర్ణయించుకున్న సుస్మిత సమీప బంధువు కొంగర అనిల్‌కు విషయం చెప్పింది.

అనిల్‌ హత్య కేసులో నిందితుడైన జయశంకర్‌ జిల్లా మొగళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్‌ను సంప్రదించాడు. వేణుకుమార్‌ను హతమార్చడానికి రూ.4 లక్షల సుపారీ మాట్లాడి.. ముందస్తుగా రూ.2లక్షలు చెల్లించాడు. పథకం ప్రకారం గత సెప్టెంబరు 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపి వేణుకుమార్‌కు ఇచ్చింది. గాఢ నిద్రలోకి వెళ్లగానే గడ్డం రత్నాకర్‌ వచ్చి వేణుకుమార్‌ను కారు వెనుక సీట్లో కూర్చోపెట్టుకుని పెద్దపల్లి జిల్లా మంథని బయలుదేరాడు. మార్గంమధ్యలో పరకాల వద్ద కటిక నవీన్‌ను కారులో ఎక్కించుకున్నాడు. మంథని వెళ్లాక.. వేణుకుమార్‌ దుస్తులన్నీ తీసి మానేరు వాగులో పడేశారు. అక్టోబరు 3న మృతదేహం లభించడంతో మంథని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పట్టించిన కాల్‌డేటా.. రత్నాకర్‌ సూచన మేరకు సుస్మిత అక్టోబరు 7న కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో తన భర్త వేణుకుమార్‌ అదృశ్యమయ్యాడని ఫిర్యాదు చేసింది. కాజీపేట ఎసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి దర్యాప్తు మొదలుపెట్టారు. సుస్మిత తరచూ ఠాణాకు వచ్చి తన భర్త ఆచూకీ ఎప్పుడు లభిస్తుందని అడుగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దర్యాప్తులో భాగంగా సుస్మిత, అనిల్‌ కాల్‌డేటాను పరిశీలించగా.. రౌడీషీటర్‌ గడ్డం రత్నాకర్‌తో మాట్లాడిన రికార్డులు లభ్యమయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వేణుకుమార్‌ హత్యోదంతాన్ని వెల్లడించారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా శోధించిన కాజీపేట ఎసీపీ పి.శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు భాస్కర్‌, మధు, శ్రీనివాస్‌, వేణు, సతీష్‌రెడ్డి, రమేశ్‌ను సీపీ రంగనాథ్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌ అభినందించారు.

ఇవీ చూడండి..

ఆరుగురు సజీవదహనం కేసు.. ఇంటికి నిప్పు పెట్టింది ఆమేనట..!

కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మహిళ మృతి.. పిల్లలు ఎలా ఉన్నారంటే..!

Last Updated : Dec 19, 2022, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.