ETV Bharat / crime

పుష్ప సీన్​ రిపీట్​.. పెళ్లైన నెలకే భర్త మెడ కోసిన భార్య - భర్త గొంతు కోసిన భార్య

wife killed husband by attacking on throat with blade
బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య
author img

By

Published : Apr 25, 2022, 12:22 PM IST

Updated : Apr 25, 2022, 8:00 PM IST

12:18 April 25

బ్లేడుతో భర్త మెడ కోసిన భార్య

వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారి

Wife Attempted to murder husband: పుష్ప సినిమాలో బుల్లి తెర వ్యాఖ్యాత అనసూయ పాత్ర​ దాక్షాయణి​ ఊరమాస్​. ఎంత మాస్​ అంటే ఆమెను చూస్తే భర్త మంగళం శీను కూడా భయపడేంత. కానీ తమ్ముడంటే ఆమెకు పంచ ప్రాణాలు. తన తమ్ముడిని పుష్ప చంపేశాడని తెలిశాక.. పగతో రగిలిపోతుంది. తమ్ముడిని చంపిన వాళ్లను మంగళం శీను చంపుతాడేమోనని ఎదురుచూసింది. ఆ ఆశ తీరకపోయే సరికి.. భర్తపై కోపం పెంచుకుంది. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి బ్లేడు తీసుకుని మంగళం శీను గొంతుకోసింది. అక్కడ మరి దాక్షాయణి.. తమ్ముడి కోసం భర్త గొంతు కోస్తే.. ఇక్కడ ఓ మహిళ కూడా అలాగే పట్ట పగలు భర్త గొంతు కోసింది. అది కూడా పెళ్లయిన నెల రోజుల్లోపే..

పెళ్లి ఇష్టం లేదని.. కాబోయే భర్త గొంతు కోసిన పుష్ప ఘటన మరువక ముందే... మరో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన నెలకే ఓ మహిళ బ్లేడుతో భర్త మెడ కోసింది. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ దారుణం వెలుగుచూసింది. రాజ- అర్చనలకు పెళ్లయి నెల రోజులే అయింది. వివాహం జరిగినప్పటి నుంచి బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆదివారం రాత్రి అర్చన పిచ్చిపట్టినట్లు ప్రవర్తించిందని చెప్పారు. అర్ధరాత్రి సమయంలో తాళిబొట్టు, గాజులు తీసేసినట్లు వెల్లడించారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఒక్కసారిగా భర్త మెడ కోసిందని పేర్కొన్నారు.

గమనించిన కుటుంబీకులు వెంటనే రాజును వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజు బోర్లా పడుకొని ఉండటంతో ప్రమాదం తప్పిందని కుటుంబసభ్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతోనే అర్చన.. రాజుపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

"రాజు- అర్చనకు వివాహం జరిగి నెల రోజులే అయింది. దంపతులిద్దరూ బాగానే ఉండేవారని కుటుంబీకులు చెబుతున్నారు. వారం రోజులుగా అత్తారింట్లో ఉంటోంది. ఆదివారం రాత్రి భార్యాభర్తలు మినహా అందరూ బయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక అర్చన బయటకు వచ్చి కాసేపు నిలబడింది. ఆ తర్వాత బ్లేడు తీసుకుని లోపలికి వెళ్లి రాజు గొంతు వెనకవైపు కోసింది. అతని స్పందించి దూరంగా జరిగి కేకలు వేశాడు. రాజు కేకలు విన్న ఇంటి సభ్యులు లోపలికి వచ్చేసరికి భయపడిన అర్చన వేరే గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు." -పోలీసులు

భర్తలపై దాడులు: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భర్తలపై జరుగుతున్న పలు అరాచకాలు కలవరపెడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడిన కొందరు మహిళలు.. పవిత్రమైన దాంపత్య బంధాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. సుపారీలు ఇచ్చి మరీ ప్రియుడి సహాయంతో భర్తను చంపిస్తున్నారు. ఫలితంగా జైలుపాలై కడుపున పుట్టిన పిల్లలను అనాథలను చేస్తున్నారు. వనపర్తిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి కేసు.. శ్మశానవాటికలో శవమై తేలింది. భర్త స్నేహితుడి మోజులో పడిన భార్య.. సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించింది. పోలీసులు విచారణ చేయగా ఇటీవల విషయం వెలుగులోకి వచ్చింది.

ఇవీ చదవండి: కొత్తగా పెళ్లైన దళిత జంటను గుడిలోకి రానివ్వని పూజారి

గుజరాత్​లో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

Love Failure : ప్రేమ విఫలమైందని.. పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు

Last Updated : Apr 25, 2022, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.