ETV Bharat / crime

వేరే మహిళతో కానిస్టేబుల్​ .. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య - నల్గొండ జిల్లా తాజా నేర వార్తలు

constable extramarital affair: అతడో కానిస్టేబుల్... తప్పు చేసిన వారిని పట్టుకొని శిక్షిందేది పోయి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో కాపురం వెలగబెడుతున్నాడు. ఈ విషయం కాస్త అతని భార్యకు తెలిసింది. వీళ్ల బాగోతాన్ని కనిపెట్టి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంది. కోపంతో ఊగిపోయిన ఆమె భర్తకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.

constable prasad
కానిస్టేబుల్ ప్రసాద్
author img

By

Published : Mar 3, 2022, 3:08 PM IST

constable extramarital affair: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్​ను అతని భార్య రెడ్ హ్యాండెడ్​గా పట్టుకొని దేహశుద్ధి చేసింది. ఈ ఘటన నల్గొండ పట్టణం ఎన్జీఓ కాలనీలో జరిగింది.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​కు చెందిన ప్రసాద్, శాంతిలకు 2001లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2015లో హైదరాబాద్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తించే సమయంలో అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

విధుల్లో భాగంగా నల్గొండ జిల్లాకు బదిలీ కావడంతో సదరు మహిళతో ఇక్కడికి మకాం మార్చాడు. ఆమె మాయలో పడి భార్యా పిల్లలను వదిలేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య గురువారం ఉదయం రెడ్​హ్యాండెడ్​గా వారిని పట్టుకుంది. అతనిని కొట్టి పోలీసులకు అప్పగించింది. తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చదవండి: 'పనిమనిషి మాస్టర్​ ప్లాన్... దొంగతనం చేస్తే ఓనర్ చూస్తుందని కళ్లు పోగొట్టింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.