ETV Bharat / crime

భర్త గొంతు కోసిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్​ కావాల్సిందే! - wife and husband blade attack news

Wife Attack With Blade in AP: భర్త గొంతును భార్య బ్లేడుతో కోసిన ఘటన ఏపీలోని నంద్యాలలో వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులకు కారణం తెలిసి షాక్​కు గురైయ్యారు. వారం రోజుల క్రితం బాధిత భర్త.. ఆమె గొంతు కోశాడు. దీంతో బాధిత మహిళ ఒంటరిగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. గాయం మెల్ల మెల్లగా నయం అవుతున్న సమయంలో ఆసుపత్రి బయటకు వచ్చిన ఆమెకు.. భర్త కనిపించాడు. దీంతో ఒక్కసారిగా అతనిపై దాడి చేసి గొంతు కోసేసింది.

Wife Attack With Blade
భర్త గొంతు కోసిన భార్య
author img

By

Published : Jan 1, 2023, 8:55 PM IST

Wife Attack With Blade in AP: ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యపై అనుమానంతో గత నెల 25న బ్రహ్మయ్య.. ఆమె గొంతు కోశాడు. వెంటనే స్పందించిన బంధువులు లక్ష్మీదేవిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. కానీ ఆరోజు నుంచి బ్రహ్మయ్య తప్పించుకొని తిరుగుతున్నాడు.

ఈ క్రమంలోనే లక్ష్మీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇందులో భాగంగానే ఆమె కొబ్బరి నీళ్ల కోసమని ఆసుపత్రి బయటకు వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో సదరు బాధిత మహిళకు.. బ్రహ్మయ్య కనిపించాడు. తన గొంతు కోసిన తర్వాత నుంచి కనిపించని భర్త.. ఆకస్మాత్తుగా కనిపించటంతో ఆమెకు అనుమానం కలిగింది. అతను ముసుగు ధరించి ఉండటం.. చేతిలో బ్లేడు ఉండటంతో మళ్లీ గొంతు కోయటానికి వచ్చాడనే అనుమానం లక్ష్మీదేవికి కలిగింది. వెంటనే బ్రహ్మయ్య వద్దకు వెళ్లి అతని చేతిలో ఉన్న బ్లేడునే తీసుకుని.. అతడి గొంతునే కోసేసింది. ప్రసుత్తం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

"ముసుగు ధరించి నా భార్య దగ్గరకి వచ్చింది. ఎందుకు ఇలా వచ్చావని అడిగితే నా గొంతు కోశావు కదా, నీ గొంతు కోస్తా అని కోసింది. దాంతో అక్కడున్న వాళ్లు నా భార్యను అడ్డుకున్నారు." - బ్రహ్మయ్య

"బ్లేడు పట్టుకుని నా వెనకలే వచ్చాడు. ఇంతక ముందు నా గొంతు కోశాడు. మళ్లీ కోస్తాడేమో అనే భయంతో, నా భర్త చేతిలోనీ బ్లేడు తీసుకునే అతని గొంతు కోశాను. ఆసుపత్రిలోనే తిరుగుతున్నాడని తెలిసింది. ఇంతక ముందు కోశాడు కదా.. మళ్లీ కోస్తాడు అనుకుని కోసాను." -లక్ష్మీదేవి

నంద్యాలలో భర్త గొంతు కోసిన భార్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.