US Shooting: అమెరికాలోని అలబామాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో విశాఖకు చెందిన చిట్టూరి సత్య కృష్ణ మృతిచెందారు. పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా సత్యకృష్ణ పనిచేస్తున్నారు. నెలరోజుల క్రితమే సత్యకృష్ణ అమెరికా వెళ్లినట్లు సమాచారం. అతని భార్య నిండు గర్భవతి. దుండగుడు జరిపిన కాల్పుల్లో సత్యకృష్ణ అక్కడికక్కడే చనిపోయారు.
హత్యకు పాల్పడిన నిందితుడి ఫొటోలను అమెరికా పోలీసులు విడుదల చేశారు. సత్యకృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: