Van Bolta in Krishna DIstrict : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. మోపిదేవి మండలం కాశానగర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. చింతలమడ నుంచి మోపిదేవి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో 20 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.