Murder in Hyderabad: హైదరాబాద్లోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటాక దారుణ హత్య జరిగింది. పీఎస్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ ఏరియాలో షోయబ్ ఖాద్రి(25) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. రాత్రి 2 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది.
హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అర్ధరాత్రి దాటినా సమీపంలోని పాన్ షాపులు తెరిచే ఉండటం.. వాటిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చదవండి: జైహింద్ మొండెం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు.. విచారణ వేగవంతం