ETV Bharat / crime

యువకుడు దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? - నాగర్​కర్నూల్​ యువకుడు హత్య

Young Man Was Murdered in Nagar Kurnool: గత కొంతకాలంగా ఓ యువకుడు.. ఒక యువతిని ప్రేమించాడు. వారి ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దల వద్దకు వెళ్లారు.. వారు నిరాకరించారు. ఇంతలోనే ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇంతకీ అసలేం జరిగింది.

young man murder
యువకుడు దారుణహత్య
author img

By

Published : Dec 24, 2022, 5:57 PM IST

Young Man Was Murdered in Nagar Kurnool: నాగర్​ కర్నూల్​ జిల్లాలో దారుణం జరిగింది. అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామానికి చెందిన లింగస్వామి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామానికి చెందిన ఆదివాసి లింగస్వామి(24) అచ్చంపేటలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అదే మండలంలోని మన్ననూరు గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు ఈ విషయం చెప్పారు.

అయితే యువతి తల్లిదండ్రులు వీరి వివాహానికి నిరాకరించారు. అయినా సరే లింగస్వామి, యువతి మధ్య ప్రేమవ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో నిన్న రాత్రి 11గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లింగస్వామిని అతికిరాతకంగా హత్య చేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. దాడి సమయంలో లింగస్వామి అరుపులు వేయడంతో నిద్రలో ఉన్న తన తల్లి లేచి చూసేసరికి కొడుకు రక్తపుమడుగులో పడి ఉండడం చూసి బిగ్గరగా అరిచింది. దీంతో చుట్టు పక్కలవారు లేచి.. ఘటనాస్థలానికి చేరుకునే చూసేసరికి మృతిచెంది ఉన్నాడు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని దగ్గరలోని పీహెచ్​సీకి తరలించి, అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని భావించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని పోస్టుమార్టం చేసిన అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. దాడి సమయంలో నిందితుడు చెప్పులు వదిలేసి వెళ్లాడు.. ఆదిశగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.