మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఓ భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. భవనం నిర్మాణానికి సంబంధించి ఇనుపచువ్వలు తీసుకెళ్లిన భారీ ట్రక్ బోల్తాపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
అపార్ట్‌మెంట్ సెల్లార్ నిర్మాణానికి ట్రక్‌లో ఇనుపచువ్వలు తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులపై పడటంతో అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.... ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: బాయిలర్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం