ఏపీ ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో పురుగులమందు తాగి.. ఇద్దరు తెదేపా కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్నరాత్రి తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పరదాడులు జరిగాయి. ఈ క్రమంలో 11మంది తెదేపా వర్గీయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
రాత్రి బెయిలిచ్చి ఉదయం విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. ఇందులో ఇద్దరు కార్యకర్తలు.. అరెస్ట్‌తో మసస్తాపం చెంది పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: COUPLE SUICIDE: కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య