ETV Bharat / crime

fake documents for Aadhar : ఆధార్​ కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన ఇద్దరిపై కేసు - ఆధార్​ కార్డుల కోసం ఫేక్​ డాక్యుమెంట్స్​

fake documents for Aadhar: హైదరాబాద్‌లో ఆధార్‌ కార్డు పొందడానికి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినందుకు ఇద్దరు వ్యక్తులపై పోలీసు కేసు నమోదైంది. అసోం రాష్ట్రానికి చెందిన ఇద్దరు.. టోలీచౌకీ పరిధి షేక్​పేటలో ఉంటున్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి ఆధార్​కార్డు పొందేందుకు ప్రయత్నించారని ఉడాయ్​ (UIDAI) రీజినల్​ డిప్యూటీ డైరెక్టర్​ ఫిర్యాదు చేశారు.

fake documents for Aadhar
fake documents for Aadhar
author img

By

Published : Dec 20, 2021, 5:54 PM IST

fake documents for Aadhar : అసోం రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్​లో ఉంటున్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆధార్​కార్డుకోసం దరఖాస్తు చేశారు. వారు సమర్పించినవి ఫోర్జరీ ధ్రువపత్రాలుగా తేల్చిన ఉడాయ్​ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసోం రాష్ట్రానికి చెందిన రబ్బానీ మా, ఠాకూర్ నితీష్‌ సింగ్‌ నగరంలోని టోలీచౌకి పరిధిలో షేక్‌పేటలో నివాసముంటున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. వాటిని అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని ఆధార్​ సెంటర్​లో సమర్పించి ఆధార్​కార్డు కోసం దరఖాస్తు చేశారు. వారు సమర్పించిన పత్రాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఉడాయ్​ (UIDAI) రీజినల్​ డిప్యూటీ డైరెక్టర్​ మధుసూధనరావు... బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చాడు... జైలు పాలయ్యాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.