ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి - two persons died in road accident at sangareddy district

ఉద్యోగం చేస్తున్న సంస్థ పనిమీద వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై దుర్మరణం చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

accident
accident
author img

By

Published : Apr 28, 2021, 10:55 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి మహారాష్ట్రకు చెెందిన లారీ ముందుకెళ్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీనితో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న కొండాపూర్​కు చెందిన నర్సింగరావు, విజయ్​లు ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. వీరు యాక్ట్​ కేబుల్​ సంస్థలో పని చేస్తున్నారు. సంస్థ పనిమీద సంగారెడ్డి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: కొవిడ్​ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.