హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులు పుదుచ్చేరికి చెందిన విజయ్‌కుమార్(34), శ్యామల దేవి (36)గా గుర్తించారు.
విజయ్‌కుమార్, శ్యామల దేవిలు ఇద్దరూ ఈ నెల 8 నుంచి ఐటీసీ కాకతీయ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రూమ్ సర్వీస్ కోసం ఫోన్ చేయకపోవడం, ఎలాంటి ఆహారం ఆర్డర్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
హోటల్‌కు చేరుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. మృతదేహాల పక్కనే తమిళంలో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో గతంలో ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిగినట్లు తెలిసింది. వివాహేతర సంబంధమే వీరి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.