ETV Bharat / crime

మహబూబ్​నగర్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు - telangana crime news

Two People Died in the Accident: కోడూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Two People Died in the Accident
Two People Died in the Accident
author img

By

Published : Nov 13, 2022, 11:40 AM IST

Two People Died in the Accident: మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని కోడూరు గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. దేవరకద్ర మండలం హాజీలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ వరి ధాన్యాన్ని ట్రాక్టర్‌లో రైస్ మిల్లుకు తీసుకెళ్తుండగా వెనక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్‌పై ఉన్న లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

దేవరకద్ర మండలం పర్దిపూర్ తండాకు చెందిన ఓ కుటుంబం కారులో నాగర్ కర్నూల్ జిల్లాలోని నాయినోన్ పల్లి మైసమ్మ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మాణిక్యమ్మ (52) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.