ETV Bharat / crime

మిస్సింగ్​: కళాశాలకు వెళ్లి ఒకరు.. విధులకు వెళ్లి మరొకరు - two people missing news

మేడ్చల్​ జిల్లాలోని వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. కళాశాలకు వెళ్లిన ఓ యువతి, విధులకు వెళ్లిన ఓ యువకుడు కనిపించడం లేదంటూ వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

two people missing
two people missing
author img

By

Published : Apr 8, 2021, 9:25 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సూరారం కాలనీకి చెందిన మౌనిక అనే యువతి చింతల్​లోని గౌతమి కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం కళాశాలకు వెళ్లిన విద్యార్థిని.. తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు మౌనికకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తోటి స్నేహితులను ఆరా తీసినా ఫలితం లేకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువకుడు అదృశ్యం..

గండిమైసమ్మ సాయిపూజ నగర్​కు చెందిన సాయికుమార్ షాపూర్​నగర్​లోని మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లిన సాయికుమార్.. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు ఫోన్​ చేయగా ఓ ఫంక్షన్​లో ఉన్నట్లు తెలిపాడు. ఉదయం వరకూ రాకపోవడంతో తిరిగి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.

ఈ రెండు కేసులపై దుండిగల్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఈమెయిల్‌ హ్యాక్‌ చేసి.. ఎంబీబీఎస్‌ విద్యార్థినికి వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.