ETV Bharat / crime

ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటుండగా ఫోన్‌లో చిత్రీకరణ.. ఆ తర్వాత.. - telangana news updates

Two people have been arrested for filming a young woman changing clothes in a shopping mall at jublihills, hyderabad

author img

By

Published : Nov 5, 2021, 2:07 PM IST

Updated : Nov 5, 2021, 4:44 PM IST

16:40 November 05

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు పోకిరీల అరెస్టు

14:02 November 05

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు పోకిరీల అరెస్టు

Two people have been arrested for filming a young woman changing clothes in a shopping mall at jublihills, hyderabad
నిందితులు కిరీట్​, గౌరవ్​

మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్గించే మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. చుట్టూ పొంచి ఉన్న పోకిరీలతో ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదో ఓ రూపంలో మహిళలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పోకిరీల వికృత చేష్టలతో.. ఎక్కడికి వెళ్లిన సేఫ్టీ అనే మాటకు గ్యారంటీ లేదు అనే నిర్ణయానికి మహిళాలోకం వచ్చేలా చేస్తున్నారు. షాపింగ్ మాల్‌లో దుస్తులు ట్రయల్​ చేసుకుంటుండగా.. ఇద్దరు పోకిరీలు వీడియో తీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పార్టీషన్​ పై నుంచి..

జూబ్లీహిల్స్​లోని హెచ్​ఆండ్​ఎం షాపింగ్​మాల్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. మాల్​కి వచ్చిన ఓ యువతి దుస్తులు ట్రయల్​ చేసేందుకు డ్రెస్సింగ్​ రూంలోకి వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు యువకులు.. ఆ యువతి వెళ్లిన గదికి ఆనుకుని ఉన్న మరో డ్రెస్సింగ్​ రూంలోకి వెళ్లారు. పార్టీషన్​ పై నుంచి... యువతి బట్టలు మార్చుకుంటుండగా... చరవాణిలో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చరవాణిని గమనించిన యువతి.. మొదట కేకలు వేసింది. అక్కడున్నవారు వెంటనే అప్రమత్తమై ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ముగ్గురిపై కేసు..

సత్వరమే స్పందించిన పోలీసులు హెచ్​ఆండ్​ఎం షాపింగ్​మాల్​కు చేరుకొని సదరు యువకులు కిరీట్ అసాట్, గౌరవ్ కల్యాణ్​ను అదుపులోకి తీసుకున్నారు. వీడియో తీసేందుకు ఉపయోగించిన చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపింగ్​మాల్​ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. స్టోర్​రూం మేనేజర్​ అమన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

మొబైల్​లో మరిన్ని వీడియోలు..

ఇద్దరు యువకులు కస్టమర్లలాగే మాల్​లో ప్రవేశించి ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. యువకుల చరవాణీల్లో ఇలాంటి దృశ్యాలు మరికొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాలను మరెక్కడైనా చిత్రీకరించారా..? లేకపోతే అంతర్జాలం నుంచి డౌన్​లోడ్ చేసుకున్నారా..? అనే వివరాలు సేకరిస్తున్నారు.

ఫుడ్​కోర్టు ఘటనలోనూ..

ఇటీవలే.. ఓ ఫుడ్​కోర్టులోని మహిళల వాష్​రూంలో.. చరవాణితో వీడియో చిత్రికరిస్తున్న ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ ఘటనలో మహిళ అప్రమత్తంగా ఉండటం వల్ల ముందే అపాయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సదరు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆ ఫుడ్​కోర్టులో పనిచేసే యువకుడే కావటం గమనార్హం.

అప్రమత్తతే రక్షణ..

ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలి పోలీసులు ఎప్పటికప్పుడు యాజమాన్యాలను హెచ్చరిస్తోన్న.. నిర్లక్ష్యంగానే ఉంటున్నారని  యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకున్నా.. మహిళలు మాత్రం ఎక్కడికివెళ్లినా వాళ్లు వినియోగించే ప్రదేశాలను పరిశీలించాలని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

Blast in Hyderabad: గుంత తీసి.. ఒకేసారి ఐదు బాంబులు పెట్టారు..!

Last Updated : Nov 5, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.