నిజామాబాద్ జిల్లా చందూర్ మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా డీసీఎం వ్యాన్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ, డ్రైవర్ మృతి చెందారు.
వీరు పిట్లం నుంచి నిజామబాద్ ఆస్పత్రికి వెళ్తుండగా చందూర్ మండల శివారులో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొని దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.