ETV Bharat / crime

ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 2 సంచుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరు మావోయిస్టులకు సామాగ్రి అందించే కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు భద్రాచలం ఏఎస్పీ తెలిపారు.

Two Maoist sympathizers were arrested in bhadradri kothagudem district
ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్
author img

By

Published : Feb 19, 2021, 12:09 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్​పేట మండలానికి చెందిన మత్తు నాగరాజు, కొమ్మరాజు కనకయ్యగా వీరిని గుర్తించారు. హైదరాబాద్ నుంచి దుమ్ముగూడెం మీదుగా భారీగా పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నట్లు ఏఎస్పీ డా.వినీత్ తెలిపారు.

పోలీసులను చూసి పారిపోతున్న వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి 2 సంచుల్లో ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరు మావోయిస్టులకు సామాగ్రి అందించే కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

ఇదీ చూడండి: సరదాగా బైక్​పై వెళ్లిన బాలుడు.. వెంటాడిన మృత్యువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.