Road Accident in Peddapalli: పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో వాహనం పెద్దపల్లి మండలం పెద్దకాల్వల రాజీవ్ రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎం వ్యానును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న చైత్రముఖి(25) అనే యువకుడితో పాటు పులా రామ్(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్కార్పియో వాహనంలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన ఇద్దరితో పాటు మిగతా ఐదుగురు మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:పెద్దపల్లి జిల్లాలో భారీ కుంభకోణం.. ఎఫ్‌సీఐకి ఎగనామం పెట్టిన కేటుగాడు