ఏపీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి కచేరి వీధిలో బాణా సంచా తయారు చేస్తుండగా.. పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వాకాడ హరి, నందిపేట మూర్తి అనే ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపుమడుగులో ఉన్న ఇద్దరిని 108 వాహనంలో టెక్కలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడు దాటికి సమీపంలోని ఓ ఇంటి అద్దాలు, మరోఇంటి పైకప్పు దెబ్బతిన్నాయి.
ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొవిడ్ వాక్సినేషన్ బంద్.. ఆ సమయంలో శానిటైజర్ వాడొద్దు!