SR Nagar Cylinder Blast: హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్లో సిలిండర్ పేలుడు సంభవించింది. బీకేగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి గోడు కూలి యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మంటలు అంటుకుని మరో యువకుడికి గాయాలయ్యాయి.
స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇవీ చూడండి: Gas Cylinder Blast in Manthani : వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు