ETV Bharat / crime

Drugs: హైదరాబాద్​లో మళ్లీ డ్రగ్స్​ కలకలం.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్​

నగరంలో మరో డ్రగ్స్​ ముఠా బయటపడింది. బంజారాహిల్స్​లోని ఓ ఇంటిపై అధికారులు దాడి చేశారు. ఇద్దరు ఎమన్​ దేశస్థులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

Two foreigners arrested in drugs case in Hyderabad

author img

By

Published : Jul 1, 2021, 6:13 PM IST

హైదరాబాద్‌లో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్‌ 10లోని ఓ ఇంటిపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడి చేశారు. తనిఖీల్లో ఇద్దరు ఎమన్‌ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 17 గ్రాముల కొకైన్‌, 8 గ్రాముల ఎండీఎంఏ, 73 ఎస్టక్‌ పిల్స్‌, 15 గ్రాముల చరాస్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈజ్‌ అనే నైజీరియన్‌ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు ఎమన్‌ దేశస్థులైన అబ్దుర్‌ బాబు, సొలమన్‌ విచారణలో వెల్లడించారు. బెంగుళూరు, ముంబయిలో వీటిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. కొకైన్‌ను గ్రాముకు 8 వేల చొప్పున అమ్ముతున్నట్టు నిందితులు వెల్లడించారు.

Two foreigners arrested in drugs case in Hyderabad
హైదరాబాద్​లో మళ్లీ డ్రగ్స్​ కలకలం.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్​

ఇదీ చూడండి: Black Magic: చేతబడి చేస్తుందన్న అనుమానంతో భార్యనే నరికి చంపాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.