వ్యవసాయ పొలంలో హద్దు కంచెపై ఉన్న విద్యుత్ తీగలకు కరెంట్ సరఫరా కావడంతో... ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన ఎడ్ల సైదులు(35), మిడ్జిల్ మండలం చిలువేరుకు చెందిన నవీన్(19) ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంత్రం అయినా నవీన్ ఇంటికి రాలేదని... తల్లి అంజమ్మ పొలానికి వెళ్లింది. అప్పటికే... ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు.
అంజమ్మ చుట్టుపక్కల రైతులకు చెప్పడంతో... వారు వచ్చి విద్యుదాఘాతంతో మృతి చెందినట్టు గుర్తించారు. వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బందికి సమాచారం అందించి సరఫరా నిలిపివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాలా కాలం నుంచి నిరుపయోగంగా ఉన్న విద్యుత్ తీగల్లో కరెంట్ ఎలా సరఫరా అయిందని పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: దాంపత్య జీవితానికి అడ్డొస్తుందని గర్భిణిని హతమార్చిన సవతి