ETV Bharat / crime

Tractor accident posanipet : ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు రైతులు దుర్మరణం - తెలంగాణ వార్తలు

Tractor accident posanipet : కామారెడ్డి జిల్లా పోసానిపేట్​లో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విద్యుత్ తీగలు తీసుకువస్తుండగా.. టైర్ పేలి ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

tractor accident posanipet , road accident
ట్రాక్టర్ బోల్తా
author img

By

Published : Dec 10, 2021, 6:07 PM IST

Tractor accident posanipet : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. టైర్ పగలడం వల్ల ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. రామారెడ్డి మండలం గిద్దె గ్రామానికి చెందిన ఆశిరెడ్డి(47), గంగరాజు(45) ట్రాక్టర్‌పై గ్రామానికి విద్యుత్ స్తంభాలు తీసుకువస్తుండగా మార్గమధ్యలో పోసానిపేట్ శివారులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను శవపరీక్ష కోసం కామారెడ్డి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్​..

Road accident today: మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ విజువల్స్​ను పోలీసులు విడుదల చేశారు. గాజులరామారానికి చెందిన మేఘన.. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నిన్న మధ్యాహ్నం తన స్నేహితురాలు సుమనశ్రీతో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణమైంది. గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వారిని టిప్పర్​ వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థిని గాయాలపాలైంది. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: Bhupatipur Farmer Suicide : సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.