ETV Bharat / crime

లక్ష్మీదేవన్​పల్లిలో కారు బోల్తా.. భార్యాభర్తలు మృతి - car overturned in kamareddy

కారు బోల్తా పడి భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీదేవన్​పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

two died when car overturned at Lakshmidevan Palli village in kamareddy district
లక్ష్మీదేవన్​పల్లిలో కారు బోల్తా
author img

By

Published : Feb 2, 2021, 7:50 AM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీదేవన్​పల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేల్పుగొండ గ్రామానికి చెందిన ప్రవీణ్ (25), రేణుక (24) కుటుంబ సభ్యులతో కలిసి గంభీరావ్​పేట్ వెళ్తుండగా.. లక్ష్మీదేవన్​పల్లి శివారులో కారు బోల్తా పడింది.

ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.