ETV Bharat / crime

వనస్థలిపురంలో బీభత్సం సృష్టించిన పాలవ్యాను... ఇద్దరు మృతి - లారీ బీభత్సం

Road Accident: హైదరాబాద్‌ వనస్థలిపురంలో లారీ బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంతో వస్తున్న పాలవ్యాను ద్విచక్రవాహనాలను అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Road Accident
Road Accident
author img

By

Published : Jun 14, 2022, 3:51 PM IST

వనస్థలిపురంలో బీభత్సం సృష్టించిన పాలవ్యాను... ఇద్దరు మృతి

Road Accident: వనస్థలిపురంలో విషాదం చోటుచేసుకుంది. హయత్​నగర్​ నుంచి వస్తున్న లారీ బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంతో ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. హయత్‌నగర్‌ నుంచి ఎల్​బీనగర్ వైపు వెళ్తున్న పాలవ్యాను... బ్రేకులు ఫెయిలై డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో పాటు రహదారి పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అక్కడివారు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:కుమారుడి బలవన్మరణం.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.