cricket trainers suspended in Proddatur: ఏపీ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్ కోచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కడప క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా నడుస్తున్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్లో ఓ బాలిక క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే ఆ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు కోచ్‌లను సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు వెల్లడించారు. వారి స్థానంలో మహిళా కోచ్‌లను నియమించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: కేంద్రం నుంచి రాని స్పష్టత.. బియ్యం తీసుకుంటారా.. లేదా?!