ఏపీలోని చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపురంలో.. తాగునీటి కోసం వ్యవసాయ బావిలో దిగి ఇద్దరు బాలికలు మృతి చెందారు. గ్రామానికి చెందిన 13 ఏళ్ల నివేద, 12 సంవత్సరాల ఉమామహేశ్వరి.. పశువులు మేపేందుకు పొలానికి వెళ్లారు. తాగునీటి కోసం పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో దిగి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నివేద మృతదేహాన్ని బయటకు తీశారు. ఉమామహేశ్వరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: వాన నీటిలో నడుస్తున్నారా? జర భద్రం!