Accident on Lalaguda Flyover : హైదరాబాద్ లాలాగూడ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. లారీని కార్లు వెనుక నుంచి ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ ఫ్లైఓవర్‌పై ఒక్కసారిగా ఆగిపోయింది. లారీ వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ గమనించి కొద్ది దూరంలో వాహనం నిలిపివేశాడు. మరో కారు అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో లారీ కిందికి దూసుకుపోయింది. కారు బెలూన్లు తెరుచుకోవడంతో ముప్పు తప్పింది.
Lalaguda Flyover Accident : సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే లారీ, కారు డ్రైవర్లు పరారయ్యారు.