ETV Bharat / crime

కోతులు తీసిన ప్రాణం.. నీటమునిగి ఇద్దరు బాలుర దుర్మరణం

కోతి చేష్టలు చూసేందుకు వినోదంగా ఉంటాయి. మితిమీరిన కోతుల గుంపు ఆగడాలతో.. రెండు ప్రాణాలు నీట మునిగాయి. కన్నవారికి కడుపుకోత మిగిలింది. మర్కటాలకు భయపడి ఐదుగురు పిల్లలు చెరువులోకి దూకగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. నిజామాబాద్​ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కోతులు తీసిన ప్రాణం.. నీటమునిగి ఇద్దరు బాలుర దుర్మరణం
కోతులు తీసిన ప్రాణం.. నీటమునిగి ఇద్దరు బాలుర దుర్మరణం
author img

By

Published : Oct 4, 2022, 9:52 AM IST

Updated : Oct 4, 2022, 10:02 AM IST

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద ప్రాణాంతకంగా మారుతోంది. కోతుల ఆగడాలకు రెండు నిండు ప్రాణాలు నీట మునిగాయి. వారి కుటుంబాలను విషాదంలో నింపాయి. నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలం మామిడిపల్లికి చెందిన 19 ఏళ్ల దీపక్, 14 ఏళ్ల రాజేశ్, 12 ఏళ్ల అఖిలేశ్, అభిలాష్, హన్మంతు.. దేవీ నవరాత్రుల సందర్భంగా మాల ధరించారు. గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి విగ్రహం వద్ద పూజలో పాల్గొంటున్నారు. సోమవారం కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు చేసేందుకు లింగం చెరువు వద్దకు వెళ్లారు.

కట్టపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వీరిపైకి కోతుల గుంపు దూసుకొచ్చింది. దీంతో భయపడిన వారు ఎటు వెళ్లాలో తెలియక చెరువులో దూకారు. ఈత వచ్చిన దీపక్.. తనకు తానుగా బయటకు రావడంతో పాటు అభిలాష్​ను కాపాడాడు. మరోవైపు రాజేశ్​ తన తమ్ముడు హన్ముంతును ఒడ్డుకు చేర్చాడు. అనంతరం స్నేహితుడు అఖిలేశ్​ను రక్షించేందుకు వెళ్లగా ఇద్దరూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాజేశ్​ డిచ్​పల్లి గురుకులంలో ఏడో తరగతి, అఖిలేశ్​ మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు.

నీట మునిగి చనిపోయిన రాజేష్​, అఖిలేష్
నీట మునిగి చనిపోయిన రాజేష్​, అఖిలేష్

ప్రాణాలు దక్కించుకున్న దీపక్​ డిగ్రీ ప్రథమ సంవత్సరం, అభిలాష్​, హన్మంతు స్వగ్రామంలోనే ఆరో తరగతి చదువుతున్నారు. అప్పటి వరకు కళ్ల ఎదుటే చెంగుచెంగుమంటూ తిరిగిన పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఇవీ చూడండి..

అవసరానికి అప్పు ఇచ్చాడు .. తర్వాత తన దుర్బుద్ధిని బయటపెట్టాడు

రూ.45 చోరీ కేసులో 24ఏళ్లకు తీర్పు.. వృద్ధుడికి శిక్ష.. ఎంత కాలం అంటే..

Last Updated : Oct 4, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.