ETV Bharat / crime

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందిస్తోన్న ఇద్దరు అరెస్ట్ - Cyber crime latest updates

సైబర్​ నేరగాళ్లకు సాయమందిస్తోన్న ఇద్దరిని హైదరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిచి... మోసాలకు పాల్పడేందుకు వీరు సహకరించేవారు.

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందిస్తోన్న ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Mar 13, 2021, 8:43 PM IST

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను అందిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్​లోని జాంతార, ధన్​బాద్ చెందిన ఇద్దరు... బ్యాంకు ఖాతాలను తెరిచి... మోసాలకు పాల్పడేందుకు తోటి సైబర్ నేరగాళ్లకు వాటిని అందించారు.

గతేడాది మే నెలలో నగరానికి చెందిన ఇద్దరికి సైబర్ నేరగాళ్లు వేర్వేరుగా ఫోన్లు చేశారు. కేవైసీని అప్డేట్ చేయాలని ఒకరిని, ఏటీఏం కార్డు మార్చాలంటూ మరొకరిని నమ్మించి... బ్యాంకు ఖాతా రహస్య వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరి నుంచి కలిపి దాదాపు రూ. లక్షా 70 వేలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్​ పోలీసులు.. నిందితులు ఝార్ఖండ్ వాసులుగా గుర్తించారు.

ఇద్దరు నిందితులకు చెందిన బ్యాంకు ఖాతాలు ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు ఫిర్యాదుదారుల నుంచి సొమ్మును కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడికి వెళ్లిన సీఐ ప్రశాంత్ బృందం, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి చంచల్​గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తే... బ్యాంకు వివరాలు చెప్పొద్దని సైబర్ క్రైమ్​ పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: యువకుడి నగ్న వీడియోలతో రూ. 2 లక్షలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.