కోవిఫర్ మెడిసిన్‌ను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డిలోని ఓ మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టి... నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా మందులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేరంలో దుకాణ యజమాని పైడిషెట్టి రాజేశ్, మరో వ్యక్తి గంగాభరి మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మూడో దశ ముప్పు.. ముందే గుర్తించొచ్చంటోన్న శాస్త్రవేత్తలు