జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి బండి కొమురెల్లి అనే గీత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి కురిసిన వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాటి చెట్టు ఎక్కుతుండగా.. వర్షం వల్ల తడిసి ఉన్న చెట్టు ఒక్కసారిగా జారడంతో చెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి కుటింబీకులు, గ్రామస్థులు చేరుకొని రోధించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : చిన్నారి ప్రాణానికి ప్రపంచమే తోడు.. క్రౌడ్ఫండింగ్తో 16 కోట్లు సేకరణ