ETV Bharat / crime

ట్రిబుల్​ ఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి

Triple IT student commits suicide బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నిజామాబాద్​ జిల్లాకి చెందిన సురేష్​ రాథోడ్​ మంగళవారం వసతి గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసుల విచారణలో మనస్థాపానికి గురై మృతిచెందినట్లు కొందరు ఆరోపిస్తున్నారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/23-August-2022/16178958_stu.jpg

author img

By

Published : Aug 23, 2022, 8:33 PM IST

Updated : Aug 23, 2022, 11:01 PM IST

Triple IT student commits suicide: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి అనుమానాస్పస్థితిలో మృతి కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండాకు చెందిన సురేష్ రాథోడ్ విద్యాలయంలో ఈ1 ఇంజనీర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో వసతి గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం మిత్రులు గదికి వెళ్లేసరికి లోపలి నుంచి తాళం వేసి ఉంది.

అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి చూడటంతో విద్యార్థి సురేష్ ఉరివేసుకొని ఉన్నాడు. వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2022, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.